25.2 C
Hyderabad

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు

Agitation is inevitable if journalists' issues are not resolved.

Must read

📰 Generate e-Paper Clip

 

    . . . టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్

 

   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయులు మీడియా పరిశ్రమకు సంబంధించిన కీలకమైన,దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టి యు డబ్ల్యూ జె జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ… ఐ జె యు పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా దేశ స్థాయిలో సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. రెండవ పత్రికా కమిషన్‌ను 1978లో నియమించగా,అది 1982లో తన నివేదికను సమర్పించింది. గత నాలుగు దశాబ్దాలుగా,24/7 ప్రసార నెట్‌వర్క్‌లు,డిజిటల్ వార్తా వేదికలు,ప్రజా చర్చలను తీవ్రంగా ప్రభావితం చేసే సోషల్ మీడియా వ్యవస్థల ఆవిర్భావంతో భారత మీడియా రంగం అపూర్వమైన పరివర్తనకు లోనైంది. పాత్రికేయులు,మీడియా సంస్థల భద్రత కోసం ఒక ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. పని చేసే పాత్రికేయుల కోసం చట్టబద్ధమైన రక్షణల పునరుద్ధరణ,పరిరక్షణ చట్టం చేయాలి. మీడియా ఉద్యోగుల కోసం కొత్త వేతన మండలి ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు   ఇళ్ళు,ఇళ్లస్థలాల  సమస్య పరిష్కరించాలని,ఉద్యోగులకు ఇచ్చిన విధంగా జర్నలిస్టులకు  హెల్త్ కార్డులు  ఇచ్చి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని,జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చట్టం తీసుకు  రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరవింద్ బాలాజీ,కోశాధికారి సిరిగాద ప్రసాద్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య,జాతీయ కౌన్సిల్ సభ్యులు గంగాదాస్,సోషల్ మీడియా సభ్యులు దేవీదాస్,జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజ్,సాయిరాం,మురళి,ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంగామోహన్,డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి,బోధన్ డివిజన్ ఇంచార్జీ గంగులు,తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article