25.2 C
Hyderabad

పెన్షన్ సాధించే వరకు పోరాటం

The struggle continues until the pension is secured.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐసీఈయూ నేత డీఎస్ రఘు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  

 

ఎల్ఐసి 1996 బ్యాచ్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం సాధించే వరకు ఐసీఈయూ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఐసీఈయూ సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రఘు స్పష్టం చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ బ్రాంచీల సంయుక్త సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్యాచ్ ఉద్యోగులకు పెన్షన్ సాధించేందుకు యూనియన్ తన వంతు కృషిని కొనసాగిస్తుందని, ఈ అంశంలో ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.పెన్షన్ అంశాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ యూనియన్‌లో అంతర్గత విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యోగులు ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ఐక్యతే యూనియన్‌కు ప్రధాన బలమని, సభ్యులందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు. కులాలు, మతాల పేరుతో ఎల్ఐసి ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని డీఎస్ రఘు పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కులు సంక్షేమం కోసం ఐసీఈయూ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహించిందని, ఆ పోరాటాలు, విలువలు, త్యాగాల పునాదులపైనే యూనియన్ నిర్మితమైందని ఆయన తెలిపారు. గొప్ప చరిత్ర, పోరాట వారసత్వం కలిగిన యూనియన్‌పై ఎవరైనా నిందలు వేస్తే సభ్యులు వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వాటిని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. యూనియన్‌ను బలహీనపరిచే ప్రయత్నాలకు ఉద్యోగులు దూరంగా ఉండాలని, పరస్పర సహకారం, ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యంగా 1996 బ్యాచ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యను పరిష్కరించే దిశగా పోరాటాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు గుణశేఖర్ శివరాం మాట్లాడుతూ ఉద్యోగుల పెన్షన్ విషయమై అన్ని అవకాశాలు స్వీకరించి 1996 బ్యాచ్ ఎల్ఐసి ఉద్యోగులకు పెన్షన్ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పెన్షన్స్ స్కీమ్ ను ఉపయోగించుకొని  ఉద్యోగులను మభ్య పెట్టేందుకు చేస్తున్న  ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు సాధించబడుతాయని అన్నారు. ఈ సందర్భంగా బ్రాంచీలకు చెందిన ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంబంధిత సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై చర్చించి, పరిష్కారానికి యూనియన్ తరఫున కృషి చేస్తామని  తెలిపారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఐసిఈయు సంయుక్త కార్యదర్శి లు బాలస్వామి రాజేష్ శ్రావణ్, జావీద్ తో పాటు  ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ బ్రాంచీలకు చెందిన ఐసీఈయూ  అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article