23.2 C
Hyderabad

గాంధీ . . . శాస్త్రీ లను స్మరించుకున్న కాంగ్రెస్ శ్రేణులు

Congress cadres paid tribute to Gandhi and Shastri.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డిసీసీ అధ్వర్యంలో గాంధీ, శాస్త్రీ జయంతి వేడుకలు

 

 నిజామాబాద్ సిటి,  బతుకమ్మ :

 

జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి,గాంధీ చౌక్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ లు మాట్లాడుతూ బ్రిటిష్ వారు భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారని,వారి పరిపాలనలో భారతదేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దేశానికి స్వాతంత్రం అవసరమని మహాత్మా గాంధీ గారు శాంతి మార్గంలో దేశ ప్రజలను ఐక్యమత్యం చేసి స్వాతంత్ర ఉద్యమం వైపు ముందుకు నడిపారని,దేశానికి స్వాతంత్రం రావడంలో మహాత్మా గాంధీ  పాత్ర ఎంతో కీలకమైంది అని అన్నారు. రెండో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళుతూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని అందించడం జరిగిందని,అదేవిధంగా ఇందిరాగాంధీ గరీబీ హఠాత్ నిదానంతో పేదవారికి కూడు గుడ్డ ఇల్లు అందించాలని లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అదే లక్ష్యంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నారని,దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం 20 ఇండ్లకే ఉన్న కరెంటును కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి ఇంటికి కరెంటును అందించిందని,అందులో భాగంగా రేవంత్ రెడ్డి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని,నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం అందిస్తున్నారని,మహిళల కొరకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని,పేదవారి ఆరోగ్యం కొరకు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నామని,జై కిసాన్ నినాదం లో భాగంగా రైతుల కొరకు రుణమాఫీ చేయడం జరిగిందని సన్నవడ్లకు భువన అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో పరిపాలిస్తున్న బిజెపి నాయకులు గాంధీ కీర్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గాంధీ  దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళుతుంది అని,రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేస్తామని,దేశాన్ని గాంధీ కలలుగన్న విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళతామని మరొకసారి మహాత్మా గాంధీ కి లాల్ బహదూర్ శాస్త్రి కి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్,రాష్ట్ర కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్,మేయర్ ఉమారాణి,పిసిసి జెనరల్ సెక్రటరీ రామ్ భూపాల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత్ ,నూడ చైర్మన్ కేశ వేణు,ఎఐసిసి పరిశీలకులు కాపుకర్ గన్ రాజ్,డిసిసి కోశాధికారి భక్తవస్తలం,ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్,గాదరి గోపి,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్,   ఎస్టీ సెల్అధ్యక్షులు యాదగిరి,ఉపాధ్యక్షులు గోపి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,మహిళ అధ్యక్షురాలు రేవతి,కార్పొరేటర్లు గంగాధర్,మనోహర్,ప్రవీణ్ యాదవ్,అదేవిధంగా బంటు బలరాం, వహీద్,లవంగ ప్రమోద్,ఉష,చంద్రకళ,మలైకా,సుజాత,అపర్ణ,స్వప్న,అదే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Congress cadres paid tribute to Gandhi and Shastri.

 

 

 

 

More articles

Latest article