23.2 C
Hyderabad

చోరి కేసులో బయట పడటానికి అప్పులు.. అప్పులు తీర్చేందుకు మళ్లీ చోరి

Incurring debts to get out of a theft case... stealing again to repay the debts

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భారీ దొంగతనం కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించిన బాన్సువాడ పోలీసులు

. . . గౌలిగూడ కాలనీలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

. . . 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి, ₹9,700 నగదు స్వాధీనం

కామారెడ్డి, బతుకమ్మ:

 

బాన్సువాడ పట్టణంలో జరిగిన భారీ చోరీ కేసును  పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బొగ్గు గుడిసె చౌరస్తా బాన్సువాడ కు చెందిన పాత నేరస్థులు దండుగుల  మైసయ్య, దండుగుల ఎల్లయ్యలను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టైల్ లో విచారించడంతో బాన్సువాడ పట్టణంలో గౌలిగూడ లో కిరాణా వ్యాపారి చింతల భాస్కర్  నివాసంలో జరిగిన చోరీ కేసు కొలిక్కి వచ్చింది. చింతల భాస్కర్ తన ఇంటికి తాళం వేసి కిరణా దుకాణం వెళ్లగా, ఇంటి పక్కన ఉండే  మైసయ్య, ఎల్లయ్యలను తాళాలను పగులగొట్టి   31.2 తులాల బంగారం, 2.3 కిలోల వేండి, రూ.9,700 నగదు ఎత్తుకెళ్ళారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు విచారణ బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీధర్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, బాన్సువాడ పిఎస్ ఎస్ఐ శిరీష ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.

Incurring debts to get out of a theft case... stealing again to repay the debts

మూడు టీంలతో అన్ని సీసీ కెమోరాలు పరిశీలించారు. సాంకేతికంగా దోరికి అనావాళ్లు ఆదారాలతో పరిశీలించగా పాత నేరస్థులు చోరీ చేసినట్లు అంచనాకు వచ్చి వారి కోసం గాలించారు. బోగ్గు గుడిసె వద్ధ అనుమానాస్పదంగా దారికి న దండుగుల మైసయ్య, ఎల్లయ్య  లు గౌలిగూడ చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. దండుగుల మైసయ్య గతంలో ఆరు చోరీలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్నారు. మైసయ్య చోరి కేసులో అరెస్టు కాబడి బెయిల్ కోసం జరిగిన ఖర్చులు, అప్పులు తీర్చాలంటే చోరి ఒక్కటే మార్గమని దొంగతనం చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 31.2 తులాల బంగారం, 2.3 కిలోల వెండి, రూ.9,700 నగధు తో పాటు ఒక మోటార్ సైకిల్, రెండు మోబైల్ పోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి బిచ్కుంద కోర్టులో హాజరు పరుచగా వారిని న్యాయస్థానం రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. చోరి జరిగిన పక్షం రోజుల్లోనే కేసును చేదించిన బాన్సువాడ డిఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీధర్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, బాన్సువాడ పిఎస్ ఎస్ఐ శిరిషాల, క్రైమ్ పార్టీ సిబ్బంది, బాన్సువాడ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

Incurring debts to get out of a theft case... stealing again to repay the debts

More articles

Latest article