ఇందూర్, బతుకమ్మ :
సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ఎన్జీవో కాలనీ చౌరస్తాలోని రైతుబజార్ వద్ద స్వచ్చ భారత్ నిర్వహించి రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా బల్ధియాలో పని చేస్తున్న సానిటరి జవాన్లతో పాటు పారిశుధ్ద్య సిబ్బందిని సన్మానించారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి శివప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి, కార్పొరేటర్ గోపిడి స్రవంతిరెడ్డి, ఫ్లోర్ లీడర్ దుంపల జ్యోతి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

