26.8 C
Hyderabad

రేవంత్ రెడ్డిని పగలు తిడుతాడు . . . రాత్రిపోయి పొర్లు దండలు పెడుతాడు

He criticizes Revanth Reddy during the day, but goes and prostrates himself before him at night.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .అరవింద్ ఎంపీ గా గెలవడం నిజమాబాద్ జిల్లా దురదృష్టం

. . . నిజామాబాద్ కు నయాపైసా తేలేని చేతకాని దద్దమ్మ

. . . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటేనే హాఫ్ నాలెడ్జి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, అవినీతి, అబద్దానికి ఆంగి లాగు తొడిగితే అది అరవింద్ అసలు రూపమని ఎద్దేవా చేశారు. అయ్యపేరు చెప్పుకుని 2004 లో కాంగ్రెస్ బీ ఫామ్ లు అమ్ము కున్న అవినీతి బాగోతాలు అరవింద్ మూటగట్టుకున్నాడని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పగలు పొట్టోడు అని తిడతాడు, రాత్రి పోయి పొర్లు దండలు పెడతాడని ఆయన వ్యాఖ్యానించారు. అరవింద్ ఎంపీ గా గెలవడం నిజమాబాద్ జిల్లా దురదృష్టమన్నారు. బనకచర్లను జనకచర్ల అనే అజ్ఞాని అరవింద్ అని, నిజామాబాద్ కు నయాపైసా తేలేని చేతకాని దద్దమ్మ అని, అలాంటి చవట సన్నాసి అరవింద్ కు రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఉందా అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ పేటీఎం బ్యాచ్ సభ్యుడు అరవింద్ అని, కాంగ్రెస్ తో పోరాడే శక్తి లేక కేసీఆర్ ను తిడుతుండు అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం లో అరవింద్ పాత్ర అణా పైసా కూడా  లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇంకెంత కాలం విషం కక్కుతారని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు, రోత మాటలకు అరవింద్ అడ్డాగా మారిండని ఆయన విమర్శించారు. అరవింద్ ఇల్లు, అతడి కుటుంబమే అవినీతి, అబద్దాల పునాదులపై పుట్టిందన్నారు. నీ అయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, నువ్వే ఒక చార్లెస్ శోభరాజ్ వి, నీ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక దావూద్ ఇబ్రహీం అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అరవింద్  ఒక డ్రగ్స్ స్మగ్లర్ అని, రాకేష్ రెడ్డి ఒక ఎర్ర చందనం దొంగ, బంగారం స్మగ్లర్ అని ఆయన ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు  ఎక్కడుందో అరవింద్ చెప్పాలని,  అరవింద్ రైతు ద్రోహి అని, ధర్మపురి కుటుంబమే పెద్ద యమపురి అని ఆయన అన్నారు.తెలంగాణ ఉద్యమంలో అరవింద్ కుటుంబం ఎక్కడుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మౌత్ స్పీకర్ గా అరవింద్ మారాడని ఆయన పేర్కొంటూ కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించే స్థాయా నీదిఅని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, సత్యప్రకాష్, లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు నదీమ్,పృథ్వి, అజీమ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, రంజిత్, అభిలాష్, మల్లారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

He criticizes Revanth Reddy during the day, but goes and prostrates himself before him at night.
 

More articles

Latest article