27.7 C
Hyderabad

తెయూ మెయిన్ క్యాంపస్ ను ఆకస్మీకంగా తనిఖీ చేసిన వైస్ ఛాన్స్ లర్

Must read

📰 Generate e-Paper Clip

తెయూ మెయిన్ క్యాంపస్ ను ఆకస్మీకంగా తనిఖీ చేసిన వైస్ ఛాన్స్ లర్

డిచ్ పల్లి, బతుకమ్మ :

తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ ను  నూతనంగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన వైస్ ఛాన్స్లర్  ఆచార్య. టి. యాదగిరిరావు ఆకస్మికంగా సందర్శించినారు.  తెయు రిజిస్ర్టార్ యాదిగిరితో కలిసి విసీ గురువారం మద్యహ్నం అన్ని విభాగాలలో   తరగతి గదులలో బోధనా జరుగుచున్న తీరును  పర్యవేక్షించినారు.  విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరుచుకోవాలని విభాగాధిపతులకు సూచించారు. అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని  అనుమతితో మాత్రమే సెలవులను వాడుకోవాలని తెలిపారు.  విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  ఉపేక్షించేది లేదని వైస్ -ఛాన్స్లర్ టి యాదగిరిరావు పేర్కొన్నారు. ఈ తనిఖీలో  వైస్ -ఛాన్స్లర్ వెంట కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి,  వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి  వివిధ విభాగాధిపతులు ఉన్నారు.

More articles

Latest article