25.7 C
Hyderabad

స్నేహపూర్వక సమ్మేళనమే ప్రసాద్ పార్టీ

Prasad's party is a friendly get-together

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్

 

ఇందూరు, బతుకమ్మ:

 

వైశ్య సంఘం వినాయక మండపాల్లో నిర్వహించే స్నేహపూర్వక సమ్మేళనమే ప్రసాద్ పార్టీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని గంజ్ లో గల పట్టణ వైశ్య సంఘంలో “ప్రసాద్ పార్టీ” నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు నడపడంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. వైశ్యులంతా ఏకతాటిపై నడిచి ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 55 సంవత్సరాలుగా తాను ప్రసాద్ పార్టీకి హాజరవుతున్నానని గుర్తు చేశారు. యువజన సంఘం కమిటీ వినాయకుని ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. సంఘంలో 82 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరింత అద్భుతంగా ఉత్సవాలని నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా సంఘం గణేష్ మండలి అధ్యక్షుడు శివకుమార్ గుప్తా, పట్టణ వైశ్య సంఘం ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, మోటూరి మురళి గుప్తా, అర్వపల్లి పురుషోత్తం గుప్తా, శ్రీనివాస్ గుప్తా, ఆయా అనుబంధ సంఘ ప్రతినిదులు తదితరులు  పాల్గొన్నారు.

Prasad's party is a friendly get-together
Prasad’s party is a friendly get-together

More articles

Latest article