నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా నూతన కార్యవర్గానికి నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గంలోని జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, టౌన్ అధ్యక్షులు ఘనంగా సన్మానించారు.జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంత ప్రవీణ్, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ గా కందేటి మౌనిక రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ గా అలీం, రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ గా నరేష్ నాయక్, నిజామాబాద్ టౌన్ ఇంచార్జ్ గా యెండల ప్రసాద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ రజక్, అర్బన్ మైనార్టీ ఇంచార్జ్ గా షాన్వాజ్, బంజారా జిల్లా అధ్యక్షుడిగా ప్రేమ్ నాయకు గా నియమించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు తీసుకున్న జిల్లా కమిటీ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు టీఆర్ఎస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ,ప్రజా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కార్యక్రమాలను చేపడుతామని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అవంతి కుమార్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు, శ్రీనివాస్ గౌడ్ సంతోష్, యువనాయకులు దినేష్, సాయి నిఖిల్, మహేష్ ,నికిత్ ,ఆశిష్ ,రేఖ ,శోభ ,తదితరులు ఉన్నారు.
