. . . స్పీకర్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్, బతుకమ్మ :
బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంధర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై కొనసాగుతున్న ఊగిసలాటకు హైకోర్టు బ్రేక్ చేసింది. పార్టీ ఫిరాయింపును దానం నాగేంధర్ పై శుక్రవారం రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. గతంలో రాష్ట్ర శాసనసభాపతి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దానం నాగేంధర్ తో పాటు మరికొందరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన పది మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తేన్నారని గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంధర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఇది ఎలా ఫిరాయింపు కాదో తెలుపాలని దానం నాగేంధర్ ను కోరింది. అయితే హైకోర్టు మాత్రం దానం నాగేంధర్ ఏప్రిల్ 23, 2024 నుంచి ఎమ్మెల్యే గా అనర్హుడని తీర్పు ప్రకటించింది. సుప్రీంకోర్టులో అప్పిల్ కు గంట అవకాశం ఇవ్వాలని ఆలోపు తీర్పును సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం తరపు న్యాయవాదులు కోరినా హైకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేగా దానం నాగేంధర్ వ్యవహరిస్తేన్న ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు హైకోర్టు స్పీకర్, ఈసీకి తెలిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉపశమనం దక్కే అవకాశాలు లేవు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

