34.3 C
Hyderabad

 పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా సంబరాలు

Celebrations marking the completion of two years for Mahesh Goud as PCC Chief.

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ రెండు సంవత్సరాలు పదవిని పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి , నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కవిత రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నగర మేయర్ ఉమారాణి,  డీసీసీబీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ,  జావీద్ అక్రమ్,  నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రేవతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నగర కార్పొరేటర్లు, జిల్లా ఎస్సీ, ఎస్టీ, యువజన కాంగ్రెస్, సేవాదళ్ అధ్యక్షులు,వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు,వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article