23.7 C
Hyderabad

బాన్సువాడలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

Distribution of clay Ganesha idols in Banswada under the aegis of TUWJ (IJU)

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  పర్యావరణ పరిరక్షణకు పిలుపు 

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డీఎస్పీ విఠల్ రెడ్డి హాజరై భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణపతి విగ్రహాల వల్ల నీటి కాలుష్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని పిలుపునిచ్చారు.పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు.ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మొత్తం 525 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. అదేవిధంగా బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా మట్టి గణపతులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇజాజ్, గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు కాలెక్, నందకిషోర్, కిషన్, చంద్రశేఖర్, జర్నలిస్టులు సాయ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, పోషిరం, సాయిరెడ్డి, ఎడ్ల మహేష్ కుమార్, మోసిన్  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article