25.4 C
Hyderabad

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

September 17 should be officially observed as Telangana Liberation Day

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార డిమాండ్

బతుకమ్మ, బిచ్కుంద  :

తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలకు గుర్తింపుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని ఆమె పేర్కొన్నారు. ఈ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి,తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ప్రజలకు తెలంగాణ చరిత్ర,విమోచన ఉద్యమం గురించి తెలియజేసేలా అధికారిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని అరుణాతార డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా యువ మోర్చా నాయకులు బుడల గంగరాజు, శివాజీ పటేల్,లాలయ్య,శ్రీకాంత్,మల్లికార్జున దేశాయ్,ధనూర్ విట్టల్‌తో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article