. . . కోటి 45,20,000/- జరిమానా . . . 124 మందికి వారం రోజులు జైలు శిక్ష
. . . వివరాలు వెల్లడించిన పోలీసు కమిషనర్ సాయిచైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 6 వారాలలో డ్రంకన్ డ్రైవ్ లో 1784 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్, అర్మూర్ కోర్టులలో వారిని హాజరు పర్చగా ఇందులో 124 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని మిగిలిన వారికీ కోటి 45,20,000/- జరిమానా విధించినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్,ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 12 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 1784 కేసుల నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోవాలని, డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడునన్నారు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడును అలాగే జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడునని, మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019) అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడునన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడునని సీపీ తెలిపారు.
