… సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని ట్యాంక్ ఎక్కి నిరసన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్స్ ఉద్యోగులకు సమయానకి వేతనాలు ఇవ్వడం లేదని బల్దీయా ఉద్యోగి జోన్ కార్యాలయం లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కు దిగాడు. సోమవారం నగరం లోని జోన్ 2 కార్యాలయం గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ లో వాటర్ వర్క్స్ విభాగం లో పనిచేస్తూన్న యూసుఫ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. బల్దీయాలో ఔట్ సోర్స్ సిబ్బంది కి వేతనాలకు గత కొంత కాలంగా ఏజెన్సీ నుంచి కాకుండా గ్రూప్ లద్వారా చెల్లింపులకు యత్నాలు జరుగుతున్నాయి. కానీ వాటిని యూనియన్ లు, సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. దాని కారణం గా వేతనాలు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. గతం లో న్యాల్కల్ రోడ్ లో ఒక ఔట్ సోర్స్ ఉద్యోగి వేతనాలు ఇవ్వడం లేదని ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. యూసఫ్ ను ట్యాంక్ దిగాలని అధికారులతో మాట్లాడుతాం అని జోన్ అదికారులు ప్రయత్నం చేస్తున్నారు.
