28.2 C
Hyderabad

యూరియా యాప్ ను రద్దు చేయాలి

The Urea app must be scrapped.

Must read

📰 Generate e-Paper Clip

. . . రైతులకు గతంలో విధంగా యూరియా సరఫరా చేయాలి

. . . ఇందల్వాయి పిఎసిఎస్ వద్ధ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన

. . . గన్నారం సోసైటి గోదాంకు తాళం వేసిన రైతులు

ఇందల్వాయి ,బతుకమ్మ :

రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ రైతులు ఇందల్వాయి మండల కేంద్రంలోని సహకార సంఘం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం గన్నారం గ్రామంలో సహకార సంఘం సొసైటీ గోదాంకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.

The Urea app must be scrapped.
The Urea app must be scrapped.

గన్నారం ముఖద్వారం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సర్కార్ అందించిన విధంగానే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు ఎటువంటి షరతులు లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి, గన్నారం, చంద్రన్ పల్లీ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. రెండు నిమిషాలలో 9 బస్తాల యూరియాను యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గంగారం, వార్డు సభ్యులు గణేష్, రాజు, మహేష్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

The Urea app must be scrapped.
The Urea app must be scrapped.

More articles

Latest article