26.2 C
Hyderabad

కొత్తపల్లిలో భారీ చోరి

Major theft in Kothapalli

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 50 తులాల బంగారం చోరి

మాక్లూర్, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో భారీ చోరి జరిగింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామ రేషన్ డీలర్ అయిన వేములపల్లి శ్రీను గత నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 50 తులాల బంగారాన్ని చోరి చేశారు. అయితే బంగారం దొంగతనం చేసిన వ్యక్తులు నగదును పట్టుచీరలను వదిలి వెళ్లడం విశేషం. ఆదివారం ఉదయం రేషన్ డీలర్ ఇళ్ళు, తాళాలు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు అతనికి సమాచారం అందించడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితులు మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా షాక్ కు గురయ్యారు. అగంతకులు చోరి తర్వాత ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు గాను పోలీసు డాగ్ కనిపెట్టకుండా ఉండేందుకు గాను మొత్తం ఇల్లంతా కారంపొడిని చల్లినట్లు గుర్తించారు. దాదాపు 75 లక్షల విలువైన బంగారం చోరి కావడంతో పోలీసులు కేసు దర్యాప్తును సవాల్ గా తీసుకున్నారు.

Major theft in Kothapalli
Major theft in Kothapalli

More articles

Latest article