హైదరాబాద్, బతుకమ్మ :
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మలక్పేట్ గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
