29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు 

Must read

📰 Generate e-Paper Clip

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

బాన్సువాడ , బతుకమ్మ : గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గిరిజనుల పంట భూముల విషయమై గతంలో అధికారులు ఇబ్బందులు గురిచేయడంతో రైతులు కమిషన్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మండలంలోని ఖాదలాపూర్ లో బుధవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు పర్యటించారు. 2021లో గిరిజనులకు ఎదురైన సమస్యలపై అధికారులతో చర్చించారు. స్థానిక నాయకుల అండదండలతో అటవీశాఖ అధికారులు, పోలీసులు గిరిజనులపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహశీల్దార్ వరప్రసాద్, డీఎస్పీ సత్యనారాయణ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article