గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు 

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ బాన్సువాడ , బతుకమ్మ : గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గిరిజనుల పంట భూముల విషయమై గతంలో అధికారులు ఇబ్బందులు గురిచేయడంతో రైతులు కమిషన్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మండలంలోని ఖాదలాపూర్ లో బుధవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు పర్యటించారు. 2021లో గిరిజనులకు ఎదురైన సమస్యలపై అధికారులతో చర్చించారు. స్థానిక నాయకుల అండదండలతో అటవీశాఖ అధికారులు, పోలీసులు...