27.6 C
Hyderabad

భార్య భర్తల ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉరివేసుకొని ఒకరు.. నిద్రమాత్రలు మింగి మరొకరు

 

. . . కుటుంబ కలహాలు.. ఆర్థిక ఇబ్బందులే కారణమా ?

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రం లో కరెంట్ ఉద్యోగి ఒకరు, భార్య తో కలిసి ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏర్గట్ల మండల కేంద్రం కు చెందిన శేషాల నరేష్ (40) విద్యుత్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. జిల్లా కేంద్రం లోని ఈఆర్ఓ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్నాడు. నరేష్ తన భార్య మేఘన (32) తో మంగళవారం ఉదయం నిజామాబాద్ నగరం లోని బైపాస్ రోడ్ లోని అద్దె ఇంటిలో గొడవ పడ్డారు. దానితో ఆవేశం లో నరేష్ ఉరివేసుకోగా , భార్య మేఘన స్లీపింగ్ పిల్స్ సేవించింది. ఇద్దరు ఆపాస్మరక స్థితి లో ఉండగా స్థానికoగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి కి తరిలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. నరేష్, మేఘన దంపతులకు 6,8 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నట్టు తెలిసింది. ఇద్దరి ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం కలహాలు కారణం అని తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Husband and wife suicide

More articles

Latest article