25.9 C
Hyderabad

ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బంజారా సంప్రదాయాలకు అనుగుణంగా ఆషాఢ మాసంలో తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని వివిధ తాండాల్లో నిర్వహించిన తీజ్ పండుగ ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా తీజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కమిటీ బాధ్యులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడారు. తీజ్ పండుగను అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా తీజ్ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొని బంజారా సమాజ సంస్కృతి, సంప్రదాయాలకు మద్దతు తెలిపిన నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు పంచరెడ్డి లలితాచరణ్, గంగాధర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వివిధ తాండాల నుంచి తరలివచ్చి తొమ్మిది రోజుల పాటు తీజ్ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన అక్కాచెల్లెళ్లు, యువతులు, యువకులు, సమాజ పెద్దలు, తాండా నాయకులు, కారోబారులు, పూజారులు, తీజ్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నిజామాబాద్ నగరంలో తీజ్ పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు సహకరించిన నగర ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు శాఖతో పాటు ఇతర అధికార యంత్రాంగం, నాయకులు, తాండా పెద్దలు, యువతీ యువకులకు జిల్లా తీజ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

. . . బంజారా సంస్కృతిలో తీజ్‌కు ప్రత్యేక స్థానం

తీజ్ పండుగ బంజారా సమాజానికి ఎంతో ప్రత్యేకమైన ఆచార, సంప్రదాయ పండుగ అని లక్ష్మణ్ నాయక్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో ముఖ్యంగా పెళ్లికాని యువతులు తీజ్‌ను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ, తమ భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం బంజారా సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని వివరించారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా తీజ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో తీజ్ కమిటీ సభ్యులు చంద్రు నాయక్, మాజీ కార్పొరేటర్ చాంగు బాయి, రమేష్ రాథోడ్, గంగారాం, సర్పంచ్ డా. లాల్‌సింగ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Teej celebrations conclude on a grand note.

More articles

Latest article