25.9 C
Hyderabad

పేదల గొంతుకగా అన్నాభావు సాటే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పేదల గొంతుకగా అన్న బాబు సాటే నిలిచారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీ చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాతంగ్ సమాజంలో పుట్టిన అన్నాభావు చిన్నప్పటి నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నారన్నారు. మిల్లులో పనిచేస్తూ వీధి దీపాల కింద కూర్చొని చదివి గొప్ప రచయిత కవిగా ఎదిగారని గుర్తు చేశారు.

 

Anna Bhau Sathe as the voice of the poor.

 

సుమారు 35 పుస్తకాలను రాసి ఆదర్శంగా నిలిచారన్నారు. కేవలం రచనలు చేయడమే కాకుండా మహారాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. జై భీమ్ జై భారత్ అనే నినాదంతో అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. ప్రధానంగా చదువు ఒక్కటే ఆయుధమని కులం పేరుతో ఎవరిని చిన్నచూపు చూడొద్దు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని సందేశాన్ని ఇచ్చారన్నారు. నిజామాబాద్ అర్బన్ లో ఉన్న అన్నాభావు సాట సమాజానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, బంటు ప్రీతి ప్రవీణ్, అన్నా భావు సాథే సమాజ్ కమిటీ అధ్యక్షుడు గంగాధర్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Anna Bhau Sathe as the voice of the poor.

More articles

Latest article