25.2 C
Hyderabad

మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడిగా అవర్ సురేష్

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడిగా అవర్ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు ఆయనకు అభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అవర్ సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను మనసా, వాచా, కర్మణా నిబద్ధతతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అవర్ సురేష్ హామీ ఇచ్చారు. సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. అవర్ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article