25.5 C
Hyderabad

చిక్కడ్ పల్లిలో ఘనంగా బోనాల పండుగ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి అనంతరం మధ్యాహ్నం చిన్న పెద్ద అందరు కలిసి భక్తిశ్రద్ధలతో భాజ భజంత్రీల మధ్య గ్రామంలోని మహిళలు నెత్తిన బోనమెత్తి పోచమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మచ్కూరి రమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్మరాజు, కార్యదర్శి గోపి, సలహాదారులు రాజయ్య, డా.మల్లేష్, కోశాధికారి జెల్ల పరమేష్, సభ్యులు కృష్ణార్జున్, కోలా శ్రీను, కొందరు అంజయ్య, సాయినాథ్, మాజీ సర్పంచ్ పుష్పలత రమేష్, పెద్ద హన్మంతు, గుడిసె హన్మంతు, జెల్ల సాయిలు, రవి, బస్వయ్య, అశోక్ తదితరులు, గ్రామస్తులు మహిళలు ఉన్నారు.

More articles

Latest article