28.5 C
Hyderabad

శతచండీ యాగంతో ఇందూరు పావనం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

శత చండీయాగంతో ఇందూరు పావనమైందని, లోక కళ్యాణార్థం యాగం చేయడం అద్భుతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన శత చండీయాగం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ యాగంతో ఎల్ నినో పరిస్థితులను అధిగమించి మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజుల యాగం ఫలితం మొదటి రోజే చూశామని సమృద్ధిగా వర్షం కురిసిందని గుర్తు చేశారు. రైతు బాగుంటే అందరూ బాగుంటారని, దేశం బాగుంటందన్నారు. హిందూ ధర్మంలో మాత్రమే “సర్వే జన సుఖినో భవంతు” అని అంటారని, అందరికోసం వేడుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా యాగం నిర్వహణకు కృషి చేసిన అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Indur sanctified by the Shata Chandi Yagam.

More articles

Latest article