మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండలం శెట్ పల్లీ గ్రామంలో అంగన్ వాడీ ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎన్ఎం సద్గుణ మాట్లాడుతూ గర్భిణి స్త్రీలు బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. ముర్రుపాలు పిల్లలకు జీవితాంతం వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుందని, అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు కొనసాగించాలని తెలిపారు. అలాగే గ్రామంలో లబ్ధిదారులందరు ప్రతినెల పిల్లల యొక్క బరువులు, ఎత్తులు తీయించుకొని పిల్లల పోషణ స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ టీచర్ సుమలత మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ కు వచ్చి గర్భిణీ స్త్రీలు రోజు ఒక పూట సంపూర్ణ భోజనం అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
