శెట్ పల్లీ అంగన్ వాడీ ఆధ్వర్యంలో తల్లిపాల వార్షికోత్సవాలు
మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలం శెట్ పల్లీ గ్రామంలో అంగన్ వాడీ ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎన్ఎం సద్గుణ మాట్లాడుతూ గర్భిణి స్త్రీలు బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. ముర్రుపాలు పిల్లలకు జీవితాంతం వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుందని, అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు కొనసాగించాలని తెలిపారు. అలాగే గ్రామంలో లబ్ధిదారులందరు ప్రతినెల పిల్లల యొక్క బరువులు,...