26.2 C
Hyderabad
Wednesday, August 5, 2026

జి.జి. కళాశాల దోస్త్ ప్రవేశాల్లో మిగిలిన ఖాళీలు 66

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్ మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జి.జి. కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, బుధవారం నాటికి 1794 మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని, కేవలం 66 ఖాళీలు మాత్రమే మిగిలియాని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి  తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో మిగిలిన ఖాళీల వివరాలు ప్రిన్సిపాల్ తెలియజేశారు. బి.ఏ. 09, ఉపాధి ఆధారిత (ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో  బీ.ఎఫ్.ఎస్.ఐ. 02,  సైన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ 08, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో 03, ఈ మూడు (ఏఈడీపీ) కోర్సుల్లో మొత్తం 180 సీట్లకు గాను 13 ఖాళీలు మిగిలాయని, బి.కాం.లో ఫినాన్స్ 01, టాక్సేషన్ 02, అనాలైటిక్స్ 04, బి.బి.ఏ. 02, మొత్తం 480 కి గాను 09 ఖాళీలు మిగిలాయని తెలిపారు. బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 21, ఫిజికల్ సైన్స్ 10, హానర్స్ 04, మొత్తం బీఎస్సీలో 720 గాను 35 ఖాళీలు మిగిలాయని, బుధవారం నాటికి 1794 మంది విద్యార్థులు తుది ప్రవేశం పూర్తి పొందారని తెలిపారు. ఆగస్టు 6 నుండి మొదలయ్యే స్పెషల్ ఫేజ్ అడ్మిషన్స్ కోసం దోస్త్ లో ఖాళీల వివరాలను బట్టి విద్యార్థులు అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగరత్నం, అడ్మిషన్ కన్వీనర్లు రమేష్ గౌడ్, రామస్వామి, దండు స్వామి, వినయ్ కుమార్, రంజిత, ఉమాకిరణ్, జయ ప్రసాద్, నహీదా బేగం, రాజేశ్, రామక్రిష్ణ, కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు,సాంకేతిక సహాయకులు శ్రీకాంత్, నాగరాజు, మోబినొద్దీన్, గంగాధర్, విజయ, వివేకానంద, రాము, నరేష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article