ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరం పావని ఇటీవల జరిగిన అకాల మరణం పట్ల నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివంగత సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఫోరం ప్రతినిధులు తాళ్ల రాంపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం ఆధ్వర్యంలో దివంగత బెజ్జరం పావని కుటుంబానికి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అయిలాపూర్ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉమ్మేడ సర్పంచ్ బొజేందర్, లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, బజార్ కొత్తూర్ సర్పంచ్ గోపు ముత్యం, సిద్ధాపూర్ సర్పంచ్ ఇర్పి మహేష్‌తో పాటు సీనియర్ నాయకులు ధర్మన్న (ఖుదావన్‌పూర్), రామకృష్ణ (ఆంధ్రనగర్), జంగిడి దేవీదాస్ (కొండూరు), నవీన్ (కౌల్‌పూర్), మురళి (చిమ్రాజ్‌పల్లి), సుధన్ (బద్గుణ) తదితరులు పాల్గొన్నారు. అనంతరం దివంగత బెజ్జరం పావని చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బెజ్జరం పావని గ్రామాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
