. . . పీసీసీ చీఫ్ ప్రకటన తో లీడర్ లలో ఉత్సాహం
. . . పదవి కాలం ముగిసిన నేతలు మళ్ళీ ఆశలు
. . . ఈ సారైనా పోస్ట్ వస్తుందని గంపేడు ఆశలు పెట్టుకున్న ఆశవాహులు
. . . పెద్ద లీడర్ ల వద్దకు క్యూ కట్టిన చోటా నాయకులు
నిజామాబాద్, బతుకమ్మ :
నామినేటెడ్ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ చేసిన ప్రకటన అధికార పార్టీ నేతల్లో ఆశలు పెంచాయి. పీసీసీ చీఫ్ సొంత జిల్లా, ముగ్గురు ప్రభుత్వ సలహా దారులు కలిగిన మంత్రి పదవి లేని జిల్లాలో పదవుల పందేరo కు తెర లేచింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఐదు కార్పొరేషన్ ల చైర్మన్ లు, నూడా చైర్మన్ పదవి తో పాటు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ లు,పలు మార్కెట్ కమిటీ ల ఛైర్మెన్, ఆలయ కమిటీ పాలక మండల్ల పదవి కాలం కొన్నిటికి ముగసింది. మరి కొన్నిటికి సమయం ఆసన్నమైంది. ఈ సమయం లో నామినేటెడ్ పోస్ట్లు భర్తీ వ్యవహారం కదలిక తెచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల కాలం అయింది. చాలామంది నేతలకు మొదటి విడితలో పదవులు దక్కలేదు. తోలి విడత లో పార్టీ నాయకుల కంటే జంపింగ్ జిలాని లకు దక్కాయ్ అనే విమర్శలు ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ కసరత్తు కత్తి మీద సామూల మారింది.
గతం లో నామినేటెడ్, కార్పొరేషన్, మార్కెట్ కమిటీ లలో, వివిధ పాలక మండల్లలో పదవులు పొంది అనుభవిస్తున్నవారు తమను కొనసాగించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు తమ గాడ్ ఫాధర్ ల చేత పైరవీలు చేస్తున్నారు. దశబ్ద కాలం పార్టీ కోసం కస్టపడి పని చేసినం తమనే తిరిగే కొంసాగించాలని చేస్తున్న సీపారాసులు ఏమేరకు పని చేస్తుందో వేచి చూడాలి. కొందరు ఎమ్మెల్యే లు కొత్త వారికీ అవకాశం ఇప్పించాలని ప్రయత్నం చేస్తుంటే, మరికొందరు మాత్రం పదవి కాలం పొడిగించాలని కోరుతున్నట్టు తెలిసింది.ఇటీవల మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కస్టపడి పని చేసిన వారికీ గుర్తింపు దక్కలని తమకు పదవులు కావాలని కోరుతున్నారు.కొన్ని ప్రాంతాల్లో పదవులు పంపిణి చేయాలి అంటే బల్దీయా పలితల్లో జరిగిన నష్టం చూసే అవకాశం ఉంది. మిత్ర పక్షం తో పాటు ప్రతి పక్షం తో కలిసి మున్సిపల్, మేయర్ స్థానాలను గెలిచినా చేదు నిజం ఉంది. పంచాయతీ లలో, మున్సిపాలిటీ లల్లలో టికెట్ దక్కని వారు మళ్ళీ పదవులు కావాలని అడుగుతుండటం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు.
నామినేటెడ్ పోస్ట్లు భర్తీ విషయం పార్టీ నాయకులకు తలనొప్పిలా మారింది. పదవులు భర్తీ చేస్తారా, పాత వారిని కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఐదు కార్పొరేషన్ పదవులు పొంది అనుభవిస్తున్నవారు అంత ఎమ్మెల్యే కాండిడేట్స్. వారికీ కొనసాగిస్తారు అనే చర్చ ఉంది. కొత్తవారికి అంటే పాత జిల్లాలో ఐదు చైర్మన్ పోస్ట్ లలో ఎవరికి తప్పిస్తారో అనే పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లో నేతల మధ్య సక్యత లేదు. గ్రూప్ రాజకీయాలకు కొదవ లెదు. ఏ నియోజకవర్గం లో ఎవరికి పదవులు దక్కుతాయో మరొకరితో పేచీ తప్పదు. ఇప్పటికి పలువురు నేతలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ క్లాస్ పీకిన దాకలాలు ఉన్నాయి. ఈనెపత్యం, త్వరలో జరిగే పరిషత్ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ను కొందరిని నామినేట్ చేసే అవకాశం ఉంది. ఐతే అది కోర్ట్ కేసులు ఉండటం తో తమకు పదవులు కావాలని చాలామంది నేతలు ఒత్తిడి తెస్తు, పైరవీలు చేస్తుండటం విశేశం. కానీ పార్టీ ప్రభుత్వ పెద్దలు ఎవరిని కరుణిస్తారో, ఎవరికి అందలం దక్కుతుందో అనే టాక్ పార్టీ లో జోరుగా సాగుతుంది.
