. . . ఎంఆర్ పిఎస్ అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ సరికేల పోశెట్టి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దండోరా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఎంఆర్ పీఎస్ అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ సరికేల పోశెట్టి మాదిగ పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించనున్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి వినాయకనగర్‌కు చెందిన మాదిగ యువతతో పాటు కుల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యమానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ అర్బన్ ఇంచార్జి సరికేల పోశెట్టి మాదిగ, కో-ఇంచార్జి తెడు గంగారాం మాదిగ, సంపత్ మాదిగ, యమున, నగేష్, శ్రీకాంత్ తదితరుల నాయకత్వంలో నిర్వహించారు. బస్తీ బస్తీకి వెళ్లి సమావేశం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను పాల్గొనాలని కోరారు. దండోరా ఉద్యమ లక్ష్యాల సాధనకు ప్రతి యువకుడు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
