బతుకమ్మ, వేల్పూరు :- వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పికె సెంటర్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళల సంఘాల అభివృద్ధి కొరకు ఈ సెంటర్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన సభ్యులు ఐకెపి అధికారులు దగ్గరుండి రైతులకు కష్టం కాకుండా చూసుకునే బాధ్యత మనందరి పైన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నర్సారెడ్డి, డైరెక్టర్ ఇమ్రాన్, వ్యవసాయ అధికారి శృతి, ఐకెపి ఎపిఎం కిరణ్, సీసీలు రవి ప్రకాష్, మురళి, ఏఈఓ షబీర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జి చరణ్, రైతులు శోభన్ రెడ్డి, పడకంటి మోహన్ రెడ్డి, పొన్నల చిన్నయ్య, బేల్దారి నవీన్, గుమ్ముల లింబాద్రి, ఎలుక సురేష్ ,మహిళ సమైక్య మాణిక్యరావు అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్
