25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రైస్ మిల్లర్ లు మనోళ్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మిలర్ల పై చర్యలకు మోకాళ్ళడ్డుతున్న అభయహస్తం

 

. . . అధికారులే చివరికి బలి పశువులు

 

. . . నకిలీ చలాన్ల కుంభ కోణం నుంచి సీఎంఆర్ వడ్ల దారి మల్లింపు వరకు

 

. . . సీఐడి విచారణ చేసిన, విజేలెన్స్ విచారణ అయినా అటేకెక్కల్సిందేనా

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ.. వరి పంట సాగుతో పాటు, ధాన్యం సేకరణ లో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్.. ఇవేమి ఊరికే చెప్పడం లేదు.. ప్రభుత్వం అదికారిక గణాంకాలు చెబుతున్నాయి.. ఉమ్మడి ఇందూర్ జిల్లా వరి పంట మీద పారిశ్రామికంగా ఆధారపడే రైస్ మిల్లులే పెద్ద పరిశ్రమ గా వ్యాపారుల తో పాటు ఎంతోమంది కి ప్రత్యక్షంగా, మరి కొంత మందికి పరోక్షంగా ఉపాధినిస్తుంది. రైతులు, వ్యాపారులు, కూలీలు అధికంగా ఆధారపడింది కూడా ఈ రంగం పైననే.. ఇదంతా ఒకవైపే అని చెప్పాలి.. రైతుల పంట సాగు చేస్తేనే ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర కావచ్చు లేదా బోనస్ అయినా దక్కెది. వ్యవసాయం పనులు చేస్తేనే కూలీలకు గానీ.. ధాన్యం బస్తాలు మొస్తే నే హమాలీ లకు కూలీ దక్కుతుంది.. కానీ మిల్లర్లు మాత్రం ప్రతి సంవత్సరం సీఎంఆర్ పేరిట వడ్లను కేటాయింపులు చేసుకొని మర ఆడించిన బియ్యం ను ఎఫ్సీఐ కి ఇవ్వకుండా ఎగవేత కు పాల్పడుతున్నారు. కేవలం ఎగవేత ద్వారా నే కోట్ల రూపాయల బియ్యం చెల్లింపులు చేయకుండా ప్రభుత్వం కు నష్టం తెస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సీఏంర్  కుంభకోణం ప్రతి ఏడాది  యాసంగి, ఖరీఫ్ సీజన్లో బహిర్గతం అవుతుంది.. కానీ ఎగవేత దారుల పై కేసులకు పరిమితం అవుతున్నారు. వారిపై రెవిన్యూ రికవరీ యాక్ట్ లేదు క్రిమినల్ కేసులు లేవు.. ఇప్పటి వరకు మిల్లర్లు జైలుకు వెళ్లిన దాకలాలు ఉండవు.కోట్ల రూపాయల కుంభకోణాలు కేవలం సీఎంఆర్ వ్యవహారం లో వెలుగు చూడటం ప్రతి సీజన్ లో నిత్య కృత్యం అయింది. ఎందుకంటె పొలిటికల్ లీడర్ల అభయహస్తం మిలర్ల పై ఉండటమే కారణం..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిల్లర్ల ధన దాహం తో కోట్ల రూపాయలు పక్క దారి పట్టిన వాటి రికవరీ లేకుండానే వారిని కనీసం బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా నే మళ్ళీ మళ్ళీ కోట్ల రూపాయలు వడ్లను అప్పగించి సహకరిస్తున్నారు పొలిటికల్ లీడర్లు.. ఏ పార్టీ అధికారం లో ఉంటే వారి అందడండలతో మిల్లర్లు ప్రతి పంట కాలంలో కోతల పేరుతో రైతుల ను, ఎగవేత తో ప్రభుత్వం కు నష్టాన్ని తెస్తున్నారు…

 

The rice millers are our own people.

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లో 2009 నుంచి 2012 వరకు వాణిజ్య పన్నుల శాఖలో నకిలీ చలాన్ కుంభ కోణం జరిగింది. దానికి సూత్రాధారులలో సింహ భాగం రైస్ మిల్లర్లే. ప్రభుత్వం కు ఎలాంటి పన్నులు చెల్లించకుండానే ఒక్కో చలాన్ పై వందల ఫేక్ చలాన్ లతో చేసిన నష్టం అక్షరాలా రూ. 1200 కోట్ల పై మాటే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత వెలుగు చుసిన ఈ కుంభం కోణం ను ఆనాటి ప్రభుత్వం సీఐడి చేత విచారణ చేయిoచింది. దాని తో మిల్లర్ల తో పాటు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. క్రిమినల్ కేసులతో దిగివచ్చిన కొందరు మిల్లర్లు, ట్రేడర్స్ ప్రభుత్వం కు ఎగవేసిన పన్నులు వాయిదా లతో చెల్లించారు. ఈ కేసులో ఆనాడు ఇద్దరు సీ టీ ఓ లతో పాటు ఒక ఏసీ టి ఓ, ఒక ఎసి లను అరెస్ట్ చేసి జైలు కు పంపారు.. క్రిమినల్ కేసులు నమోదయినా, రెవిన్యూ రికవరీ యాక్ట్ పెట్టిన మిల్లర్లు ఎగేవేసిన పన్నులు మొత్తం చెల్లించకుండా నే మోకాళడ్డింది. దాని తో సీఐడి విచారణ ఇంకా తెములనే లేదు.

 

The rice millers are our own people.

 

గత ప్రభుత్వం హయాంలో వందల కోట్ల సీఏంఆర్ వడ్లను మిల్లర్లు దారి మల్లించారు. సీ ఏం ఆర్ చెల్లింపుల కోసం పీడీయెస్ బియ్యం ను రిసైక్లింగ్ ద్వారా ఎఫ్సిఐ కు అప్పగించారు. కానీ కోట్ల రూపాయల బియ్యం మిల్లర్ల వద్ద ఉండిపోయింది. ఈ విషయం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు పలువురు మిల్లర్ల పై కోటగిరి పోలీస్ స్టేషన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. కానీ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఆర్ ఆర్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పిన ఇంత వరకు దాని ఊసే లెదు. కానీ ధాన్యం కేటాయింపులు చేసిన సివిల్ సప్లై డిఏం, సివిల్ సప్లై డిఎస్ఓ లను సస్పెండ్ చేసారు. 2023 లో జరిగిన ఈ వ్యవహారం లో ఒక జాయింట్ కలెక్టర్ పై ఇద్దరు సివిల్ సప్లై డిటి లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. తరువాత వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం లోని పెద్దలు సీ ఏం ఆర్ కుంభకోణం పై అధికారం లేనప్పుడు గగ్గోలు పెట్టి, ప్రభుత్వ పగ్గాలు చేతికి వచ్చిన తరువాత సైలెంట్ అయ్యారు. ఎందుకంటే మిల్లర్లు మన పార్టీ వాళ్ళని, మన మధ్ధత్తు దారులు అని అనుకోవడం కారణం.

తాజాగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని కాలూరు -ఖానాపూర్ పారిశ్రామిక వాడగా పేరుగానించిన ప్రాంతం లో రెండు రైస్ మిల్లు లు  రూ. 72 కోట్ల సీఏంఆర్ ఎగవేతకు పాల్పడినట్టు విజిలెన్స్ విచారణ లో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లాలోనీ బీర్కూర్ లోని ఒక రైస్ మిల్లులో  రూ. 2 కోట్ల ధాన్యం గళ్లంతు అయినట్టు సమాచారం. ఇక కామారెడ్డి శివారులో నీ మరో రైస్ మిల్లు లో ఇదే తతంగం వెలుగు చూసింది. సంబందించిన మిల్లార్ల పై కేసులకు పరిమితం అవుతారా రికవరీ చేస్తారా అనే సంశయం వ్యక్తo అవుతుంది. మిల్లర్లు అధికార పార్టీ బడా నేతను శరణు కోరగా అభయహస్తం ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి యేటా జరిగే తంతు మాదిరిగా నే సీఏంఆర్ ఎగవేత కేసు ఆటకేక్కుతుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

The rice millers are our own people.

More articles

Latest article