26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాహుల్ కలను సాకారం చేసిన మల్కాజ్ గిరి సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

పుట్టుకతోనే దివ్యాంగుడైన రాహుల్ చిరకాలంగా పోలీస్ అధికారి కావాలనే కలను మనసులో పెట్టుకున్నాడు. కనీసం ఒక్కరోజైనా పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావాలని కోరుకున్న అతని ఆకాంక్షను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బడుగుల సాకారం చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించిన సీపీ, రాహుల్‌ను తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ధరింపజేశారు. అనంతరం అతనితో ఆప్యాయంగా ముచ్చటించి, పోలీస్ శాఖ పనితీరు గురించి వివరించారు. తన చిరకాల కల నిజమైన ఆనందంలో రాహుల్ ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారని పలువురు అభినందించారు. విధి నిర్వహణలో కర్తవ్యనిష్ఠతో పాటు సమాజం పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించడం పోలీస్ శాఖ బాధ్యతలో కీలక భాగమని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. రాహుల్ కలను నెరవేర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమం మల్కాజిగిరి పోలీసుల సేవాభావం, సామాజిక బాధ్యత, మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.

 

Malkajgiri CP makes Rahul's dream come true.

More articles

Latest article