రాహుల్ కలను సాకారం చేసిన మల్కాజ్ గిరి సీపీ
హైదరాబాద్, బతుకమ్మ : పుట్టుకతోనే దివ్యాంగుడైన రాహుల్ చిరకాలంగా పోలీస్ అధికారి కావాలనే కలను మనసులో పెట్టుకున్నాడు. కనీసం ఒక్కరోజైనా పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావాలని కోరుకున్న అతని ఆకాంక్షను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బడుగుల సాకారం చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించిన సీపీ, రాహుల్‌ను తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ధరింపజేశారు. అనంతరం అతనితో ఆప్యాయంగా ముచ్చటించి, పోలీస్ శాఖ పనితీరు గురించి వివరించారు. తన చిరకాల కల...