. . . నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా ప్రతి నాయకుడు తమ తమ డివిజన్లలో అందుబాటులో ఉండి ప్రజలకు సహకరించాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి తెలిపారు. 43వ డివిజన్ పరిధిలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐఆర్ ఆబ్జర్వర్ గన్ రాజ్ పర్యవేక్షణలో, బొబ్బిలి మురళి సమన్వయంతో, 43వ డివిజన్ ఇంచార్జ్ ఎర్రం గంగాధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓ లకు అందించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు. పార్టీ పరంగా బీఎల్ఎ లు చురుకుగా పనిచేసి ప్రజలకు సహకరించాలని సూచించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు ఇంటింటికి వెళ్లి స్థానికులను కలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, వారు తమ ఫారాలను బీఎల్ఓ లకు అందజేశారా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ ఆకుల లలిత, నూడా చైర్మన్ కేశ వేణు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శరత్, కోశాధికారి భక్త వాత్సలమ్, ఏఐసీసీ అసెంబ్లీ కోఆర్డినేటర్ గన్ రాజ్, జావీద్ అక్రమ్, నరేందర్, లడ్డు, కోఆర్డినేటర్ వహీద్, సలీం, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

