24 C
Hyderabad
Sunday, August 2, 2026

కళ్యాణ లక్ష్మి దరఖాస్తుదారుడి నుంచి లంచం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏసీబీకి చిక్కిన జీపీఓ

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కళ్యాణ లక్ష్మి పథకం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. రంగారెడ్డి జిల్లా దోమ మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి నుంచి మోత్కూర్ గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) జగదీశ్ రూ.6 వేల లంచం కోరినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు, జగదీశ్ లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లంచాలు డిమాండ్ చేస్తూ పేదలను వేధించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

More articles

Latest article