27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నలుగురు అరెస్ట్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భారీ మొత్తంలో గంజాయిని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు రూ.56 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం, మారేడుమిల్లి ప్రాంతంలో కిలో గంజాయిని సుమారు రూ.1,500కు కొనుగోలు చేసిన నిందితులు, దానిని బెంగళూరులో కిలో రూ.8,000కు విక్రయించి భారీ లాభాలు ఆర్జించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో ఎర్టిగా కారులో గంజాయిని లోడ్ చేసి వేగంగా తరలిస్తుండగా, సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు వాహనాన్ని ఛేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన సలీమ్ పాషా, హర్బజ్ హుస్సేన్, గుల్జార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం చేపట్టింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

More articles

Latest article