భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం
. . . నలుగురు అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : భారీ మొత్తంలో గంజాయిని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు రూ.56 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం, మారేడుమిల్లి ప్రాంతంలో కిలో గంజాయిని సుమారు రూ.1,500కు కొనుగోలు చేసిన నిందితులు, దానిని బెంగళూరులో కిలో రూ.8,000కు విక్రయించి భారీ లాభాలు ఆర్జించాలని ప్రణాళిక రూపొందించారు....