28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నగరంలో మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పారిశుద్ధ్యం, రహదారులపై ప్రత్యేక దృష్టి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితిపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం డివిజన్ నెం.3, 19, 43, 18 లలో విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను, రహదారుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గుంతలు ఏర్పడిన రహదారులను వెంటనే వెట్ మిక్స్ పద్ధతిలో మరమ్మతులు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు నిరంతరాయంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నగర పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, నిర్వహణ చర్యలపై కమిషనర్‌కు వివరాలు అందించారు.

 

Municipal Commissioner conducts field inspections in the city.

More articles

Latest article