27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్.రాజశ్రీ

 

భీమ్ గల్, బతుకమ్మ

 

వర్షకాలం దరిమిలా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్. రాజశ్రీ సూచించారు. బుధవారం భీమ్ గల్ ప్రేమరీ హెల్త్ సెంటర్ ను ఆమె సందర్శించారు. సిబ్బంది హాజరును, ఆసుపత్రిలో సౌకర్యలను పరిశీలించి, మందుల నిల్వలను గురించి సిబ్బందిని అడిగి తెల్సుకొన్నారు. అన్ని రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా డీఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ వర్షకాలం దృష్ట్యా  ప్రజలకు సీజనల్ వ్యాదులు ప్రబలకుండ గ్రామాల్లో స్థానిక వైద్య, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని, వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయలన్నారు. ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారి డాక్టర్. అజయ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Better medical services should be provided to patients.

More articles

Latest article