29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

జుక్కల్ లో 100% ఓటర్ల నమోదు తప్పనిసరి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో రాజీ లేదని, ప్రతి ఒక్క ఓటరు వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లు, అలసత్వం ఉండకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ నమోదులో కచ్చితంగా 100% ఓటర్ల వివరాలను పొందుపరచాలని, ఒక్క ఓటరు పేరు కూడా మిస్ అవ్వకూడదని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కేలా చూడాలని, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి పేర్లను వెంటనే చేర్చాలని, చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేయు విధంగా పార్టీ శ్రేణులు విశేషంగా కృషి చేయాలని ఆయన కోరారు. జుక్కల్ నియోజకవర్గంలో పారదర్శకంగా, లోపాలు లేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article