28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆదర్శ పాఠశాల లో విద్యార్థినీలకు తప్పని వేధింపులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరు కాంట్రాక్ట్ టీచర్ ల విధుల నుంచి శాశ్వతంగా  తోలగింపు

 బాన్సువాడ, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని  మోడల్  స్కూల్ లో పనిచేస్తున్న గోపాల్, పవన్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ టీచర్ లను శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్టు కామారెడ్డి డిఇఓ మల్లిఖార్జున్ తెలిపారు. ఒప్పంద ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తోపాటు,వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపి ఒప్పంద ఉపాధ్యాయులు గోపాల్, పవన్ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలడంతో వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా విద్యాధికారి మల్లికార్జున్  తెలిపారు. విద్యార్థినిలు పట్ల లైంగిక వేధింపుల ఘటన పై పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. కోందరు ఉపాధ్యాయులు ఈ విషయంను బయటకు పోక్కనీయకుండా చేసి వివాధం సద్ధుమనిచేందుకు యత్నించినట్లు తెలిసింది..

Harassment Inevitable for Female Students at Model School

More articles

Latest article