నిజామాబాద్, బతుకమ్మ :
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గడిచిన నెలలో నిర్వహించిన నీట్ పరీక్ష – 2026 లో నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. గురువారం రాత్రి వెలువడిన నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ రిజల్ట్ లో ఎస్ ఆర్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని జోనల్ ఇంచార్జ్ గోవర్దన్ రెడ్డి, రీజీనల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ లు తెలిపారు. నీట్ రీ ఎగ్జామ్ లోనూ పది వేల లోపు ర్యాంకులు సాధనతో పాటు, నాలుగు అత్యుత్తమ ర్యాంకులను సాధించారని వారు తెలిపారు. కళాశాలకు చెందిన పి.సాయి రుద్ర తేజ ఆల్ ఇండియా లో 9888 ర్యాంకును సాధించాడని తెలిపారు. నగరంలోని గంగాస్థాన్ కి చెందిన సాయి రుద్ర తేజ భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ అవుతానని తెలిపారు. కళాశాలకే చెందిన ఆర్.సాత్విక ఆల్ ఇండియా 11168 ర్యాంకును సాధించిందని, భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి నిపుణురాలిగా అవుతానని తెలిపారు. మరో విద్యార్థిని కోమల్ ఆల్ ఇండియా 16438 ర్యాంకు సాధించిందని, భవిష్యత్తులో తాను న్యురాలజిస్ట్ అవుతానని తెలిపారు. అలాగే సోన్య అనే మరో విద్యార్థిని ఆల్ ఇండియా 12924 ర్యాంకును సాధించిందని, భవిష్యత్తులో గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తానని తెలిపారు. ప్రభుత్వ ఎంబీబీఎస్ కళాశాలలో దాదాపు ఎస్ ఆర్ కళాశాలకు చెందిన 16 విద్యార్థులకు ఉచిత సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు వచ్చిన విద్యార్థులను కళాశాలకు చెందిన అధ్యాపకులు అభినందించారు.

