26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రైతులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో ఎలినీనో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అందువల్ల రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు వేసిన పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రధానంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి వీటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన కార్యాచరణ పై చర్చించాలని ఆయనన్నారు. ప్రధానంగా రైతులకు రుణమాఫీ చేయాలని, సబ్సిడీలతో ఎరువులను, మందులను, విత్తనాలను అందించాలని, గ్రామాల్లో పట్టణాల్లో పేదలకు ఉపాధి హామీ పనులకు నిధులను పెంచాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయటానికి కార్యాచరణను రూపొందించాలని, ఉపాధి అవకాశాలను పెంచటానికి ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగాన్ని తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ప్రకటించినట్లుగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలకు నోటిఫికేషన్లను విడుదల చేయాలని లేనియెడల రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్, రాములు వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, నన్నేసావ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article