30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ లో చిన్నారులకు సోమవారం గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రాలను వేయించారు. ఈ ఆల్బెండజోల్  మాత్రాలను 1 సంవత్సరం వయస్సు నుండి 19 సంవత్సరాలు వయస్సు వారికి వేయాలని,1వ సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయస్సు వారికి సగం టాబ్లెట్, 2 నుండి 19 సంవత్సరాల వయస్సు వారికి ఒక టాబ్లెట్ వేయాలని స్థానిక మల్టీపర్పస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్  శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గౌరీ, 2 వ వార్డు మెంబర్ అమంద్ వెంకటేష్, అంగన్వాడీ టీచర్ గంగామణి, ఆశ కార్యకర్త ప్రేమల తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article