27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సంఘ అభివృద్ధికి అందరూ పాటు పడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

చేనేత సహకార సంఘ అభివృద్ధికి అందరూ పాటుపడాలని, కార్మికుల పక్షాన ఉండి వారికి సహాయ సహకారాలు అందించాలని సంఘ నూతన కార్యవర్గ నాయకులు అన్నారు. జూలై 10 వ తేదీన జరిగిన చేనేత సహకార సంఘం ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన సభ్యులకు రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పిటిసి నారోజీ గంగారాం, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్ లు సోమవారం శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో సంఘం అధ్యక్షులు లోల శంకర్, ఉపాధ్యక్షులు మోత్కూరి నారాయణ, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ పహాడే, డైరెక్టర్లు బేతి గంగారాం, మోత్కూరి సాయిలు, మోత్కూరి లక్ష్మణ్, తాటిపాముల విజయ్, మోత్కూరి కళావతి, జొర్రిగల లక్ష్మిలు ఉన్నారు. అదే విధంగా నూతన కమిటీ సభ్యులందరికీ మంచి పేరు ప్రతిష్టలు రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సిబ్బంది ఈర్వ నాగరాజ్, నర్సింలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article