వేల్పూర్, బతుకమ్మ :
వర్ష కాలం వచ్చి నెల కాలం గడిచిపోయిన, రాష్ట్రంలో నైరుతి రూతుపవనాలు ప్రవేశించిన వర్షాలు కురువకపోవడంతో, వర్షాలు కురువాలని, వరుణ దేవుని కరుణ కావాలని కోరుతూ రామన్నపేట లో సర్వ దేవతలకు జాలాభిషేకం చేశారు. స్థానిక అయ్యలగుట్ట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ సలంద్రాల కార్యక్రమం లో భాగంగా ఉదయమే తడపకాల గంగ నుండి పవిత్ర గంగజలం ను తీసుకొచ్చారు. దప్పు వాయిధ్యాలు, మంగళహారాతులుతో ఊరేగింపుగా గ్రామంలోని అన్ని దేవత గుడులను తిరుగుతు శుభ్రం చేసి, ప్రత్యేక పూజలను నిర్వహించి, ఆయా గుడుల్లోని విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు.పాటిమీద హనుమండ్ల ఆలయం నుండి అభిషేకం కార్యక్రమంను ప్రారంభించి అధిక వర్షాలు కురువాలని, సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గ్రామంలోని అన్ని ఆలయాలలో అభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు రాజారపు శోభన్, ఉపాధ్యక్షుడు గౌరి సంజీవ్, కోశాధికారి జంగిటి సాయన్న, సలహాదారులు ఎలుక శ్రీనివాస్ గౌడ్, కుర్మ నర్సయ్య, కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారి ఎల్లాకర్ వివిధ కుల సంఘాల నుండి వచ్చిన మహిళలు, పురుషులు, తదితరులు పాల్గొన్నారు.

