26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కంజర్ గురుకులం ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిర్వహణపరమైన లోపాలు ఉన్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి రావడంతో మొపాల్ మండలం కంజర్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ విజయలలితకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారుల తనిఖీ సందర్భంగా కంజర్ గురుకుల విద్యాలయం నిర్వహణలో లోపాల గురించి కలెక్టర్ దృష్టికి రావడంతో జోనల్ అధికారిణి యుగంధర లక్ష్మిచే ప్రాథమిక విచారణ జరిపించారు. జోనల్ అధికారిణి సమర్పించిన నివేదికలో నిర్వహణ పరమైన లోపాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో గురుకులం ప్రిన్సిపాల్ విజయ లలితకు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వహణలో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించబోమ ని, అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

More articles

Latest article